ఎమ్మెల్యేకు నిరుపేద కళాకారుల వినతి

06-11-2026 | 09:06pm

ప్రతి నెల పెన్షన్ అందించాలని కోరిన కళాకారులు 

కామారెడ్డి, నవంబర్ 6 (విజయక్రాంతి): నిరుపేద కళాకారులకు ప్రతినెల పెన్షన్ అందించాలని కోరుతూ శుక్రవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు(MLA Madan Mohan Rao) కలిసి కళాకారులు వినతి పత్రాన్ని అందజేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఉద్యమ కళాకారులకు సారథి సంస్థలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు.

వికలాంగుల కళాకారులకు ప్రత్యేక స్కూటీలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని కళాకారుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనచైతన్య కళాకారుల సంఘం అధ్యక్షుడు కాగుల మోహన్ యాదవ్, జిల్లాలోని నిరుద్యోగ కళాకారులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు