16న బతుకమ్మ ఫ్యామిలీ డే వేడుకలు
- పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్
- విజయవంతం చేయాలని పిలుపు
భూపాలపల్లి టౌన్, అక్టోబర్ 13 ( విజయక్రాంతి ) : సింగరేణి సంస్థ (Singareni Company)భూపాలపల్లి ఏరియా ఆధ్వర్యంలో ఈనెల 16వ తేదీన బతుకమ్మ ఫ్యామిలీ డే వేడుకలు నిర్వహించనున్నట్లు ఏరియా అధికార ప్రతినిధి, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్(Personnel Manager S. Shyamsundar) తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రిష్ణకాలనీలోని మినీ ఫంక్షన్ హాలులో నిర్వహించనున్న వేడుకలకు ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి, సేవా సమితి అధ్యక్షురాలు శ్రీమతి సునీత రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిధులుగా హాజరవుతారని తెలిపారు. బతుకమ్మ పండుగ విశిష్టతను చాటిచెప్పడంతో పాటు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని మహిళలు, సింగరేణి ఉద్యోగుల కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేయాలని ఆయన కోరారు.