కరీంనగర్ KFCలో అధికారుల తనిఖీలు.. చివరకు సీజ్!

06-11-2026 | 10:24am

కస్టమర్ల ఆరోగ్యంతో ఆటలా? KFC అవుట్‌లెట్‌లో తనిఖీలు!

కరీంనగర్ క్రైo, నవంబర్6 (విజయక్రాంతి): కరీంనగర్ లోని KFC అవుట్ లెట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు గురువారం రాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రజా ఆరోగ్య రక్షణలో భాగంగా కరీంనగర్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దృష్టి సారించి గురువారం సాయంత్రం కరీంనగర్ లోని ప్రముఖ కేఎఫ్​సీ కంపెనీ అవుట్ లెట్ ను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో పలు లోపాలు బయటపడినట్ల ఫుడ్ సేఫ్టీ అధికారులు వెల్లడించారు. వంట కోసం ఉపయోగించే నూనెను మళ్లీ మళ్లీ వాడుతున్నట్లు గుర్తించారు. పదే పదే వేడి చేసిన నూనెను వాడటం వల్ల ఆహారం తినే వారి ఆరోగ్యానికి తీవ్ర హాని కలుగుతుందని ఓవైపు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్న కనీస బాధ్యత కూడా పాటించకుండా వ్యవహరించడంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతేకాకుండా ఆహార తయారీకి ఉపయోగించే పనిముట్లను సరిగా నిర్వహించడం లేదని, పరిశుభ్రత పాటించడం లేదని తనిఖీల్లో తేలింది. కిచెన్ లో పనిముట్ల నిర్వహణలో నిర్లక్ష్యం కనిపించినట్లు అధికారులు తెలిపారు. వినియోగదారుల ఆరోగ్యం దృష్ట్యా ఫుడ్ సేఫ్టీ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, మళ్లీ మళ్లీ వాడిన నూనెను వాడకూడదని అధికారులు  యాజమాన్యానికి సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు