రౌడీ షీటర్ల ఇళ్లకు ఎస్పీ
రౌడీ షీటర్ల జీవన విధానంపై జిల్లా ఎస్పీ ఆరా..
అర్ధరాత్రి రౌడీల ఇళ్లలో ఆకస్మిక తనిఖీలు...
ఆదిలాబాద్, నవంబర్ 06, (విజయక్రాంతి) : జిల్లాలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా, ప్రజలకు రక్షణ కల్పించడం పోలీసుల బాధ్యతగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్(Adilabad SP Akhil Mahajan ) అర్ధరాత్రి ఆకస్మికంగా రౌడీ షీటర్ల తనిఖీ కార్యక్రమాన్ని చేపట్టారు. గురువారం అర్ధరాత్రి ఆదిలాబాద్ లోని వివిధ పోలీస్ స్టేషన్ ల పరిధిలోని రౌడీ షీటర్ల ఇళ్లను తనిఖీ చేశారు. రాత్రి వేళల్లో ఇంట్లోనే ఉన్నరా లేరా అని రౌడీలను పరిశీలించి వారి నేరచరిత్ర ప్రస్తుత, జీవనశైలి, ఉపాధి పరిస్థితులు, సామాజిక వ్యవహార ధోరణులపై ఆరా తీశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డిఎస్పి ఎల్. జీవన్ రెడ్డి, పట్టణ సీఐలు సునీల్ కుమార్, నాగరాజు సిబ్బంది, ఎస్ఐ నాగనాథ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.