ఐసీఐసీఐ లైఫ్ క్వాలిటీ 50 ఇండెక్స్ ఫండ్‌ ఆవిష్కరణ

10-11-2026 | 05:10am

ముంబై: ఐసీఐసీఐ లైఫ్ ఇన్సూరెన్స్(ICICI Life Insurance) తమ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లకు (యులిప్) సంబంధించి ఐసీఐసీఐ లైఫ్ బీఎస్ఈ 500 మొమెంటం క్వాలిటీ 50 ఇండెక్స్ ఫండ్ పేరిట కొత్త ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది. ఇది చాలా మటుకు యులిప్‌లతో లభిస్తుంది.

ఆర్థికంగా పటిష్టంగా ఉన్న, షేర్ల కదలికలు సానుకూలంగా ఉన్న కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసేందుకు ఇది అవకాశం కల్పిస్తుంది. మొమెంటం, నాణ్యత అనే రెండు అంశాల ప్రాతిపదికగా బీఎస్ఈ 500లోని మెరుగైన 50 స్టాక్స్‌తో కూడుకున్న పోర్ట్‌ఫోలియోలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలికంగా ఇన్వెస్టర్లు అత్యుత్తమ రాబడులను పొందేందుకు ఈ ఇండెక్స్ ఫండ్ ఉపయోగపడుతుంది. “అత్యంత నాణ్యమైన వ్యాపారాలు నడుపుతూ, ఆదాయార్జన అవకాశాలు, షేరు ధరల కదలికలు సానుకూలంగా ఉన్న కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో సంపదను పెంచుకోవడంలో ఇన్వెస్టర్లకు ఐసీఐసీఐ లైఫ్ బీఎస్ఈ మొమెంటం క్వాలిటీ 50 ఇండెక్స్ ఫండ్ సహాయపడుతుంది.

రిటర్న్ ఆన్ ఈక్విటీ, డెట్ టు ఈక్విటీ, ఎర్నింగ్స్ పర్ షేర్‌లాంటి కొలమానాలు, నిష్పత్తుల ఆధారంగా ఎంపిక చేయబడి, ఆర్థికంగా పటిష్టంగా ఉండి, గడిచిన 12 నెలల వ్యవధిలో మెరుగైన వృద్ధి కనపర్చిన కంపెనీలతో కూడుకున్న పోర్ట్‌ఫోలియోలో పెట్టుబడులు పెట్టడంలో ఇన్వెస్టర్లకు ఇది సహాయకరంగా ఉంటుంది. మార్కెట్ ఆటుపోట్లను అధిగమిస్తూ దీర్ఘకాలిక పెట్టుబడుల ద్వారా ఇన్వెస్టర్లు కాంపౌండింగ్ ప్రయోజనాలను పొందేలా చూడాలనే కంపెనీ లక్ష్యానికి అనుగుణంగా ఈ ఇండెక్స్ ఫండ్ ఉంటుంది” అని ఐసీఐసీఐ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ Mr. మనీష్ కుమార్ తెలిపారు.

2026 సెప్టెంబర్ 30 నాటికి బీఎస్ఈ 500 మొమెంటం క్వాలిటీ 50 ఇండెక్స్ ఫండ్ 7 ఏళ్ల వ్యవధిలో 23.7 శాతం వరకు రాబడులు అందించింది. అంటే 7 ఏళ్ల క్రితం ఇందులో రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే అది ఇప్పుడు రూ. 4.4 లక్షలు అయ్యేది. ఈ ఫండ్ పోర్ట్‌ఫోలియో మూడు నెలలకోసారి రీబ్యాలెన్స్ చేయబడుతుంది. వ్యాపారాల ఫండమెంటల్స్, మార్కెట్ అవకాశాలకు అనుగుణంగా అప్‌డేట్ చేయబడుతుంది.

మరిన్ని వార్తలు