రెండు రోజుల్లో తాత్కాలిక డైవర్షన్ రోడ్డు పూర్తి చేస్తాం.
ఎమ్మెల్యే జారె హామి.
ములకలపల్లి,నవంబర్ 06, (విజయక్రాంతి): ములకలపల్లి మండలంలో(Mulakalapalli Mandal) గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు మూకమామిడి - మొగరలగుప్ప గ్రామాల మధ్య తెగిపోయిన వంతెనను అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ కోర్సా ఆదిలక్ష్మి,గ్రామస్తులు,రైతులు ఎమ్మెల్యేకి వంతెన తెగిపోవడం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను,వరి పంటలు నేలమట్టమై జరిగిన నష్టాన్ని వివరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గారు మాట్లాడుతూ తెగిపోయిన వంతెన వల్ల ప్రజలు ఇబ్బంది పడకుండా రెండు రోజుల్లో తాత్కాలిక డైవర్షన్ రోడ్డు పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.శాశ్వత వంతెన నిర్మాణానికి కూడా వెంటనే ప్రతిపాదనలు పంపి నిధులు మంజూరు చేయిస్తా ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు.అలాగే పంట నష్టపోయిన రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ,వరి మొదలైన పంటచేలు నేలమట్టమై రైతులు తీవ్రంగా నష్టపోయారు.
పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది.వ్యవసా,రెవెన్యూ అధికారులతో పంట నష్టం అంచనా వేయించి,నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.మురసు తుఫాను ప్రభావం వల్ల వాగులో చిక్కుకొని ప్రాణాలతో బయటపడిన మిరియాల మధును పరామర్శించారు.మిరియాల మధును కాపాడిన రెస్క్యూటీం అధికారులను,ఆపత్కాల సమయంలో ప్రాణాలకు తెగించి కాపాడినందుకు అభినందించారు.
ఎమ్మెల్యే వెంట స్థానిక సర్పంచ్ కోర్సా ఆదిలక్ష్మి,ఉప సర్పంచ్ కురసం సీత,ఆత్మ కమిటీ చైర్మన్ సుంకురవల్లి వీరభద్రం,కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, ములకలపల్లి మాజీ జడ్పిటిసి బత్తుల అంజి,మండల ఎంపీడీవో సత్యనారాయణ, తహసిల్దార్ స్వాతి బిందు,స్థానిక ఎస్సై మధు ప్రసాద్,ఏవో అరుణ్ బాబు,పంచాయతీరాజ్ ఏఈ శ్రీనివాసరావు,ఎంపీ ఓ రమేష్ బాబు,విద్యుత్ శాఖ ఏఈ నరేష్ కుమార్,ఆర్డబ్ల్యూ ఏఈ వరప్రసాద్, పంచాయతీ సెక్రెటరీ దోమల అరుణ్ కుమార్,ఏఈఓ రాహుల్,సంబంధిత శాఖల అధికారులు మరియు వార్డు సభ్యులు కీసరి రాజ్ కుమార్,కొడిమే ముత్తయ్య,భూక్య అశోక్,కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కారం సుధీర్,పాలకుర్తి సుమిత్,మాజీ ఎంపీటీసీలు తాటి తులసి,సున్నం సునీత,గ్రామ అధ్యక్షులు అనంతల సత్యనారాయణ,స్థానిక నాయకులు,ముత్యం బిక్షం,కీసరి వెంకట్రావు,పున్నెం రామచంద్ర,కీసరి వెంకటేశ్వర్లు,కీసరి గోపయ్య,కోర్సా పాపారావు,గడ్డం బాబు గుండి రమేష్,కొండ్రుం ప్రసాద్,వట్టం శీను,భూక్య మంగ్య,కీసరి గోపాలరావు,పొట్ట రమేష్,దుబ్బా నరసింహారావు,తాటి వీరభద్రం,గ్రామస్తులు,రైతులు పాల్గొన్నారు.