బియ్యం అమ్మకంలో తేడా.. వ్యాపారులపై కొరడా!

06-11-2026 | 07:37pm
  1. తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు
  2. 26 కిలోల బియ్యం బస్తాలో కిలో బియ్యం మాయం
  3. బాబుక్యాంప్, పెద్దబజార్‌లో అధికారుల ఆకస్మిక తనిఖీలు
  4. నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులపై 6 కేసులు నమోదు

చుంచుపల్లి, నవంబర్ 6 (విజయక్రాంతి): వినియోగదారుల జేబులకు చిల్లు పెడుతూ తక్కువ తూకంతో సరుకులు విక్రయించే వ్యాపారులపై తూనికలు, కొలతల శాఖ అధికారులు కొరడా ఝళిపించారు. బియ్యం బస్తాల బరువులోనే భారీ తేడాలు బయటపడటంతో వ్యాపార వర్గాల్లో కలకలం రేగింది. 26 కిలోలుగా పేర్కొన్న బియ్యం బస్తాల్లో కేవలం 25 కిలోలే ఉండటాన్ని అధికారులు గుర్తించారు.

సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర(Civil Supplies Commissioner Stephen Ravindra) ఆదేశాల మేరకు శుక్రవారం కొత్తగూడెం పట్టణంలోని బాబుక్యాంప్, పెద్దబజార్ ప్రాంతాల్లో బియ్యం దుకాణాలు, కిరాణా, జనరల్ స్టోర్లలో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్యాకేజ్డ్ కమోడిటీస్ నిబంధనలను ఉల్లంఘించిన వ్యాపారులపై మొత్తం ఆరు కేసులు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు