పంచాయతీ కార్మికునికి అండగా నిలిచిన ఫ్రెండ్స్ ఫోరం
13-10-2026 | 03:39pm
బోథ్ అక్టోబర్ 13 (విజయక్రాంతి) మండలంలోని కౌటా(బి )గ్రామానికి చెందిన గంగాధరి వీరేష్ అనారోగ్యం పాడిన పడడంతో ఆయనకు అండగా గ్రామస్తులతో పాటు వివిధ గ్రామాల ప్రజల సైతం ముందుకు వస్తున్నారు. గ్రామానికి చెందిన ఫ్రెండ్స్ ఫోరం సభ్యులు(Friends Forum members) ఐదువేల రూపాయలను అందివ్వడం జరిగింది.
అంతేగాక గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కొంకటి గంగాధర్ 2000 రూపాయలు అందించారు. మండల కేంద్రానికి చెందిన ఫ్రెండ్స్ డీజే యజమాని ఇర్షద్ అలీసైతం వెయ్యి రూపాయలు అందించారు. మానవత దుఃఖంతో చేయూతనిస్తున్న వారికి ఆయన కుటుంబీకులు రుణపడి ఉంటామని పేర్కొన్నారు.