భూములను పరిశీలించిన కలెక్టర్
13-10-2026 | 05:28pm
కుబీర్ (విజయక్రాంతి): తానూర్ మండలంలో నిర్వహిస్తున్న భూముల రిసర్వే జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా(Collector Bhavesh Mishra) మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సర్వే చేస్తున్న గ్రామాలకు వెళ్లి సర్వ సిబ్బంది ఎలా సర్వే చేస్తున్నారు రైతుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న భూ సర్వే రీ సర్వే ద్వారా భూముల సమస్య పరిష్కారం అవుతుందని రైతులకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా రైతులు జిల్లా కలెక్టర్ ను శాలువాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ మహేందర్ నాథ్ సర్వేయర్ కిషన్ పాల్గొన్నారు.