గొల్ల బుద్ధారం గ్రామంలో ప్రమాద బీమాపై అవగాహన
భూపాలపల్లి రూరల్, అక్టోబర్ 13 ( విజయ క్రాంతి ) : భూపాలపల్లి మండలం గొల్ల బుద్ధారం గ్రామంలో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్(India Post Payments Bank) ఆధ్వర్యంలో డీసిడీపి కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ(Gram Panchayat) ఆవరణంలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ప్రమాద బీమాపై అవగాహన కార్యక్రమం.
నిర్వహించగా ఐపిపీవి మేనేజర్ ప్రమోద్, భూపాలపల్లి సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, ఎం ఓ నరేష్, సర్పంచులు సుంకరి కిరణ్, లంబాడి తండ సర్పంచ్ జైపాల్ రెండు గ్రామాల కార్యదర్శులు గ్రామస్తులకు ప్రమాద బీమా ఆరోగ్య బీమా, పొదుపుపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని వివిధ సంఘాల ప్రతినిధులు, మహిళా సంఘాలు, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో బీపీఎంలు శివశంకర్, రాజేష్, రాకేష్, రాజేంద్రప్రసాద్, వెంకటేష్, ప్రశాంత్, చాంద్ మియా, బాలాజీ, సతీష్, సమ్మయ్య, రాజు, శశి కుమార్, సావు స్నేహ, నజ్రీన్, కోమటిరెడ్డి, స్నేహ పాల్గొన్నారు.