దివ్యాంగులకు లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం
సాలూర, అక్టోబర్ 13 (విజయక్రాంతి): సమాజంలో అవసరంలో ఉన్న బాధితులకు, దివ్యాంగులకు చేయూతనందించేందుకు లయన్స్ క్లబ్(Lions Club) వంటి సేవా సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని ప్రతినిధులు పేర్కొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవ(Lions Club of Bodhan Ayyappa Seva) ఆధ్వర్యంలో, 'పీపుల్స్ వెల్ఫేర్ అసోసియేషన్' పంపించిన ఉచిత వీల్ చైర్‌ను సోమవారం సాలూర మండలంలోని జాడి జమాల్ పూర్ గ్రామానికి చెందిన దాసరి చిన్నయ్యకు బాధితుని నివాసప్రాంతంలో అందజేశారు.
ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ ఐ క్యాంప్ చైర్మన్ లయన్ ఎం. గోవింద్ రెడ్డి, క్లబ్ అధ్యక్షుడు లయన్ కుమ్మరి పోశెట్టి మాట్లాడుతూ.. నడవలేని స్థితిలో ఉన్న దాసరి చిన్నయ్య ఇబ్బందులను గమనించి పీపుల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సౌజన్యంతో ఈ వీల్ చైర్‌ను ఉచితంగా అందజేసినట్లు తెలిపారు. నిరుపేద బాధితులకు ఇటువంటి సాధనాలు అందించడం వల్ల వారు స్వతంత్రంగా రాకపోకలు సాగించే వీలు కలుగుతుందన్నారు.
సమాజంలో నిరుపేదలు, దివ్యాంగుల సంక్షేమానికి లయన్స్ క్లబ్ నిరంతరం కృషి చేస్తుందని, భవిష్యత్తులోనూ ఇటువంటి సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేపడతామని స్పష్టం చేశారు. వీల్ చైర్ అందుకున్న బాధితుడు చిన్నయ్య క్లబ్ ప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి లయన్ గుడిపల్లి గంగారెడ్డి, కోశాధికారి లయన్ సూరాబత్తుని శ్రీనివాసరావు, ప్రోగ్రాం చైర్మన్ లయన్ ఎస్.ఆంథోని మేరి, ప్రతినిధులు లయన్ డి.తామసయ్య, లయన్ బి.రమేష్, లయన్ ఎం.ఆదినారాయణ రెడ్డి, లయన్ ఎం. సంతోష్ రెడ్డి, లయన్ కోటేశ్వరరావు, లయన్ కె.వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.