సైబల్ నేరగాళ్లకు ఓటీపీలు చెప్పవద్దు
నాగిరెడ్డిపేట్,అక్టోబర్ 13 (విజయ క్రాంతి):మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Union Bank of India) వద్ద పోలీస్ కళాబృందంచే అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.కామారెడ్డి జిల్లా సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ ఎం రాజేష్ చంద్ర(District SP M. Rajesh Chandra) ఆదేశానుసారం నాగిరెడ్డిపేట్ మండల సబ్ ఇన్స్పెక్టర్ భార్గవ్ గౌడ్ సూచన మేరకు హెడ్ కానిస్టేబుల్ మదన్ ఆధ్వర్యంలో పోలీస్ కళాబృందంచే అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
సైబర్ నేరస్తులకు ఓటీపీలు చెప్పవద్దు.సైబర్ నేరాల టోల్ ఫ్రీ నెంబర్ 1930,మాదక ద్రవ్యాల నిర్మూలన టోల్ ఫ్రీ నెంబర్ 1908 సమాచారం అందించాలని తెలిపారు. అత్యవసర సమయంలో డెల్ 112 కాల్ చేయాలని మహిళాలకు రక్షణగా షి టిమ్ ఉంది.షి టామ్ నెంబర్ 8712686094 అంతేకాకుండా రోడ్డు ప్రమాదాలు నివారణ కోసం హెల్మెట్ ధరించాలని, దొంగతనాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని,
గుర్తుతెలియని వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్త తీసుకోవాలని కార్యక్రమంలో సూచించారు.ఈ కార్యక్రమంలో పోలీస్ బృందం ఇన్చార్జి హెడ్ కానిస్టేబుల్ రామచంద్ర, తిరుపతి,శేషారావు, కానిస్టేబుల్ ప్రభాకర్ సాయిలు,బ్యాంకు మేనేజర్ పవన్,హెడ్ కానిస్టేబుల్ మదన్,దక్షిణామూర్తి, సాయికుమార్,శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.