ఎల్‌బీఎస్ నగర్‌లో ఘనంగా దేవి ఉత్సవాలు
13-10-2026 | 05:25pm
బోధన్ (విజయక్రాంతి): బోధన్ పట్టణంలోని ఎల్‌బీఎస్ నగర్ కమ్యూనిటీ హాల్‌లో ప్రతిష్ఠించిన దేవి అమ్మవారి సన్నిధిలో లాల్ బహదూర్ శాస్త్రి దేవి ఉత్సవ సమితి(Lal Bahadur Shastri Devi Utsava Samithi) ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి కుంకుమార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ ఉత్సవాల్లో ఉత్సవ సమితి సభ్యులు, కాలనీ వాసులు, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. పూజా కార్యక్రమాలతో ఎల్‌బీఎస్ నగర్‌లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.