అలుపెరగని ఉద్యమకారుడు మాజీ ఎమ్మెల్యే మల్లేష్
బెల్లంపల్లి: సీపీఐ మాజీ ప్రతిపక్ష నేత దివంగత కామ్రేడ్ గుండా మల్లేష్(CPI Leader Gunda Mallesh) 6వ వర్ధంతి కార్యక్రమం పట్టణ సీపీఐ ఆఫీసులో జరిగింది. ఈ సందర్భంగా భగత్ సింగ్ విగ్రహం వద్ద ఉన్న గుండ మల్లేష్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణ సీపీఐ కార్యాలయంలో జరిగిన గుండా మల్లేష్ వర్ధంతి సభకు ముఖ్య అతిథులుగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేణు శంకర్, మంచిర్యాల జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, రాష్ట్ర కంట్రోల్ కమిషన్ కార్యదర్శి మిట్టపల్లి వెంకటస్వామి హాజరై మాట్లాడారు.
అమరజీవి గుండ మల్లేష్ కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి పేద ప్రజల సమస్యలపై అలుపెరుగని ప్రజా ఉద్యమాలు నిర్మించాడన్నారు. దున్నేవానికి భూమి చెందాలని పోరాటం చేశాడని తెలిపారు. భూమిలేని పేదలకు భూమి ఇవ్వాలని, లాకప్ డెత్ లకు వ్యతిరేకంగా పోరాటాలు చేసినా మహోన్నతమైన నేతనీ కొనియాడారు.. సామాన్య కుటుంబంలో పుట్టి భారత కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతానికి ఆకర్షితులై బాసెట్టి గంగారం, పోతుగంటి పోశెట్టిలకు ప్రియశిష్యుడై సింగరేణి ఉద్యోగాన్ని వదిలేసి కమ్యూనిస్టు పార్టీలో చేరాడన్నారు.
రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా, ఆసిఫాబాద్ నియోజక వర్గానికి మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారని తెలిపారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో ఎన్నో ప్రాజెక్టుల గురించి, తుమ్మడిహిట్టి ప్రాజెక్టు నిర్మించాలని జిల్లాను సస్యశ్యామలం చేయాలని శాసనసభలో గళమెత్తారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గుండా మల్లేష్ గ సతీమణి గుండ సరోజన, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు బీ.పూర్ణిమ, జిల్లా కార్యవర్గ సభ్యులు చిప్ప నరసయ్య, పట్టణ సహయ కార్యదర్శి బొల్లం తిలక్ అంబేద్కర్, బెల్లంపల్లి మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ, మహిళా సమైక్య జిల్లా అధ్యక్షులు సోని, బి కే ఎం యు జిల్లా కార్యదర్శి చంద్రమణిక్యం, జిల్లా రైతు సంఘం అధ్యక్షులు రాజేశం, జిల్లా సమితి సభ్యులు డిఆర్ శ్రీధర్, రత్నం రాజం, నాయకులు స్వామి దాసు, కామర దుర్గయ్య, కే తిరుపతి, జి మహేందర్ రెడ్డి, స్వర్ణలత, చంద్రయ్య, మిట్టపల్లి మల్లేష్, శంకర్, ప్రశాంతి, పాల్గొన్నారు.