గాంధీనగర్ లో ఘనంగా బతుకమ్మ పండుగ ఏర్పాట్లు
13-10-2026 | 05:35pm
గణపురం,అక్టోబర్ 13 (విజయక్రాంతి): మండలంలోని గాంధీనగర్ గ్రామంలో(Gandhinagar Village) బతుకమ్మ ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సర్పంచ్ డాక్టర్ ఇంజపెల్లి శ్రీనివాస్(Sarpanch Dr. Injapelli Srinivas) , షఫీ క్ ఆధ్వర్యంలో పల్లె ప్రకృతి వనం ప్రాంగణంలో భూమిని చదును చేస్తున్నారు.
సద్దుల బతుకమ్మ దసరా పండుగను పురస్కరించుకొని గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సర్పంచ్ శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా గాంధీనగర్ గ్రామ ప్రజలకు ముందస్తు సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలిపారు.