అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు
మునిపల్లి, అక్టోబర్13 ( విజయక్రాంతి ) : అన్ని వర్గాలకు ప్రజా ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు(Welfare benefits) అందజేస్తుందని రాయికోడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సతీష్ కుమార్, మాజీ ఎంపీపీ రాంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు రసూల్ పటేల్, మాజీ ఎంపీటీసీ బుర్కల పాండు(Former MPTC member Burkala Pandu) అన్నారు.
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 76 మంది లబ్ధిదారులకు ఎమ్మార్వో రంగారావుతో కలిసి వారు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు వినియోగించుకొని ఆర్థికంగా లబ్దిపొందాలన్నారు.
పేదింటి యువతుల వివాహానికి కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఎంతోగానో లబ్ధిచేకూరుస్తున్నాయన్నారు. అందుకు మంత్రి దామోదర రాజనర్సింహ కృషితో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బుర్కల రాజు, సర్పంచులు బుడ్డ మల్లేశం, అశోక్ , వీరేశం, ప్రభుదాస్, ఆయా గ్రామాల అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.