జిల్లాలో 26 మంది రైతుల ఆత్మహత్య : బొర్రన్న
ఆదిలాబాద్, నవంబర్ 06 (విజయక్రాంతి): ఎల్ నీనో ప్రభావంతో ఈ ఏడాదిలో ఆదిలాబాద్ జిల్లాలో 26 మంది రైతులు ఆత్మహత్య లు చేసుకున్నారని రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షులు సంగెపు బొర్రన్న అన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం(Adilabad Rural Mandal) కచ్ కంటి గ్రామానికి చెందిన రైతు రాజేశ్వర్ సాగు చేస్తున్న పంట పూర్తిగా ఎండిపోవడంతో ఇటీవల పురుగుల మందు తాగి ఆత్మహత్మ చేసుకున్నాడు. దీంతో శుక్రవారం రైతు కుటుంబాన్ని ఆయన పరామర్శించి, వాస్తవంగ వ్యవసాయానికి చేసిన పంట పెట్టుబడి, దిగుబడులపై అధ్యయనం చేస్తూ, ఆర్థిక స్థితిగతులపై కుటుంబ సభ్యుల నుండి సమాచారం సేకరించారు.
వ్యవసాయనికి పెట్టిన పెట్టుబడి రాదనే బెంగతో ఈ ఏడాది లో ఎలినినో ప్రభావ తీవ్రత ఎక్కువగా ఉండడం రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. వాస్తవంగా గత సంవత్సరం అతి భారీ వర్షాల వలన పంట చేతికి రాక, ఈ ఏడాదిలో అత్యల్ప వర్షపాతం ఉండడంతో పంటలు ఎదుగకుండా మరొక పక్క ప్రకృతి విపత్తుల ద్వారా అదిక, అత్యల్ప వర్షపాతలు నమోదు అయ్యాయన్నారు. రైతు కుటుంబాలను మానవతా దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన GO నంబర్ 194 ప్రకారంగా ఆరు లక్షల రూపాయల పరిహారంతో పాటు కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించే విదంగా ప్రయత్నం చేయవలసిన అవసరం ఉందని అయన అన్నారు.