ఓటరుగా ఓటు హక్కు పొందేందుకు మరో అవకాశం

11-11-2026 | 06:33pm

ఈఆర్వో మందమకరందు..

బోథ్ నవంబర్ 11 (విజయక్రాంతి): ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్ జాబితా నుంచి ఏ ఎస్ డి డి జాబితాలో నమోదు అయిన వారికి ఓటు హక్కును పొందేందుకు ఎన్నికల కమిషన్ మరో అవకాశాన్ని ఇచ్చిందని నియోజకవర్గ ఎలక్షన్ రిటర్నింగ్ అధికారి ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి మంద మకరందు(ERO Mandamakrandu) తెలిపారు. బుధవారం స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు నియోజకవర్గ పరిధిలోని తాసిల్దార్లతో ప్రత్యేక సవరణ ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేయడం జరిగింది ఎస్ ఎస్ డి డి జాబితాలో పేర్లు ఉన్నవారు మరోసారి నింపి సమర్పించడం ద్వారా ఓటర్ జాబితాలో తన పేరు నమోదు చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. స్థానికంగా ఉండి ఇంతవరకు ఎన్ని ఫారం అనాగ్జరీ బి ద్వారా సమర్పించాలన్నారు. అంతేగాక నివాసం మారిన వారు ఇనాక్సరీ సి ఫారం నింపి నివాస ద్రు వ పత్రం సమర్పించాల్సి ఉంటుందన్నారు.

కేవలం ఏ.ఎస్.డి జాబితాలో ఉన్న వారికి మరో అవకాశం ఉందని ఈనెల 21 లోగా ప్రక్రియ పూర్తి చేసి ఇవ్వాలన్నారు. ఈ విషయాన్ని రాజకీయ పక్షాల వారు ఓటర్లకు అవగాహన కలిగించాలన్నారు. ఎలక్ట్రోల్ లిట్రసి క్లబ్ ఈ ఎల్ సి ఎస్ లో భాగంగా ఆయా పాఠశాల విద్యార్థులకు ఎలక్షన్ గురించి అవగాహన కల్పించి ఎస్ ఏ మరియు క్విజ్ పోటీల కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. సమావేశంలో అన్ని మండల తాసిల్దారు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు