నరకం చూశా.. ఉపాసన ఎమోషనల్
రెండో ప్రెగ్నెన్సీ అంత ఈజీ కాదు.. కన్నీళ్లు పెట్టుకున్న ఉపాసన!
హైదరాబాద్: మెగా కోడలు, ప్రముఖ పారిశ్రామికవేత్త ఉపాసన కొణిదెల తన రెండో ప్రెగ్నెన్సీ సమయంలో ఎదుర్కొన్న మానసిక సంఘర్షణను బయటపెట్టి భావోద్వేగానికి గురయ్యారు. బయటకు నవ్వుతూ కనిపించినా, తన మనసులో ఇంకా కొన్ని బాధాకరమైన జ్ఞాపకాల నుంచి కోలుకుంటున్నానని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆమె, తన మాతృత్వ ప్రయాణంలోని కష్టమైన అనుభవాలను పంచుకున్నారు. మొదటి ప్రెగ్నెన్సీ సమయంలో తనకు అండగా నిలిచిన డాక్టర్లు సుమన, నమితలకు ఉపాసన కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా రెండోసారి గర్భధారణ అనుభవం మాత్రం తనకు ఎంతో కఠినంగా అనిపించిందని చెప్పారు. "ఈ నవ్వుతున్న ముఖం వెనుక ఇంకా గాయం నుంచి కోలుకుంటున్న ఓ తల్లి ఉంది" అంటూ తన భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు.
గర్భధారణ అంటే కేవలం తొమ్మిది నెలల ప్రయాణం మాత్రమే కాదని, అంతకుముందు నుంచే మహిళలు ఎన్నో మానసిక ఒత్తిళ్లను ఎదుర్కొంటారని వివరించారు. Fertility Journey, Pregnancy Anxiety, Mental Health వంటి అంశాలపై బహిరంగంగా మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రెగ్నెన్సీ కోసం ఎదురుచూస్తున్న సమయంలో నెలసరి రావడం కూడా కొందరు మహిళలకు తీవ్ర మానసిక వేదన కలిగిస్తుందని పేర్కొన్నారు. సమస్యలను మనసులో దాచుకోకుండా, అవసరమైనప్పుడు కుటుంబ సభ్యులు, వైద్య నిపుణుల సహాయం తీసుకోవాలని ఉపాసన సూచించారు.