ఎస్.జి.ఎఫ్.ఐ హ్యాండ్‌బాల్‌లో పారమితకు కాంస్య పతకం!
కొత్తపల్లి, నవంబర్ 18(విజయక్రాంతి): తెలంగాణ పాఠశాల క్రీడా సమాఖ్య(Telangana School Sports Federation) ఆధ్వర్యంలో ఈ నెల 13 నుండి 15 వ తేదీ వరకు మహబూబ్ నగర్ జిల్లా(Mahabubnagar District) లో జరిగిన 70 వ యస్. జి. ఎఫ్. ఐ. తెలంగాణ రాష్ట్రస్థాయి అండర్(S. G. F. I. Telangana State Level Undergraduate)-17(బాల బాలికల) హ్యాండ్ బాల్ ఛాంపియన్ షిప్ పోటీలలో స్థానిక పద్మనగర్ పారమిత హెరిటేజ్ పాఠశాల 10 వ తరగతికి చెందిన సి.హెచ్. భువన , 9 వ తరగతికి చెందిన ఏ. మోక్షజ్ఞ అత్యుత్తమ ప్రతిభ మ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలలో కాంస్య పథకం సాధించారు.రాష్ట్రస్థాయిలో పథకాలు సాధించిన విద్యార్థులను పాఠశాల చైర్మన్ డాక్టర్ ఇ. ప్రసాదరావు మరియు డైరెక్టర్స్ ప్రసూన, అనూకర్ రావు, రశ్మిత, రాకేశ్, వి.యు.యం.ప్రసాద్, ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమం లో పాఠశాల డైరెక్టర్ కె.హన్మంతరావు, ప్రధానోపాధ్యాయుడు గోపికృష్ణ, సమన్వయ కర్తలు నాగరాజు, రాము, రబీంద్ర పాత్రో వ్యాయామ ఉపాధ్యాయుడు అమరేందర్ ,రాజు, సాజన్ లు పాల్గొన్నారు.