న్యాయవాదులు డిపాజిట్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

18-11-2026 | 10:21pm

కొత్తపల్లి, నవంబర్ 18 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా కోర్టు(Karimnagar District Court) పరిధిలోని న్యాయవాదుల(Lawyers) ఆధ్వర్యంలో ఇటీవల ప్రారభించిన కో ఆపరేటివ్ సొసైటీ(Cooperative Society) ఆధ్వర్యంలో కోర్టు కు జమానాత్ కోసం చేస్తున్నటువంటి డిపాజిట్ సదుపాయాన్ని న్యాయవాదులు, తద్వారా కక్షిదారులు వినియోగించుకోవాలని న్యాయవాదుల సహకార సంఘం చైర్మన్ గడ్డం లక్ష్మణ్ కోరారు. ఇటీవల ప్రారంభించిన ఈ సదుపాయం సందర్బంగా ఇద్దరి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్ పత్రాలను తయారు చేసి బుధవారం రోజున వారికి అందించారు.

ఈ సదుపాయం వల్ల కోర్టు లో నిందితుల పక్షాన జమానత్ కోసం వినియోగించే డిపాజిట్ బాండ్ లను ఇతర బ్యాంకు లలో చేసుకొనే ప్రయాస తప్పినట్లయిందని ఇందుకు సహకరించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్. శివకుమార్,  సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.సొసైటీ ప్రధాన కార్యదర్శి బెజ్జెంకి శ్రీకాంత్,కోశాధికారి సుంకె దేవకిషన్,సీనియర్ న్యాయవాదులు కొరివి వేణుగోపాల్,గౌరు రాజిరెడ్డి,రాజు, సామ్యూల్,వెంకటేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు