కావాలనే చేస్తుండ్రు... రాకుంటే మేమేం చేస్తాం
సదర్ ఉత్సవంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్
రాజకీయ రంగు అలుముకున్న సదర్ ఉత్సవాలు
హన్వాడ మండల కేంద్రంలో సదర్ ఉత్సవాలకు హాజరైన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు హాజరు కాకపోవడంతో కాంగ్రెస్ వర్గాల్లో అసహనం
హన్వాడ : పార్టీలకు అతీతంగా జరుపుకోవాలని పండుగ సమయాల్లో కూడా రాజకీయ రంగు అలుముకుంటుంది. హన్వాడ మండలం(Hanwada Mandal) కేంద్రంలో బుధవారం రాత్రి సదర్ ఉత్సవాలను(Sadr Festival) నిర్వహించారు. ఈ వేడుకలకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(Yennam Srinivas Reddy) తోపాటు మేయర్ డిప్యూటీ మేయర్ తో పాటు అధికార పార్టీ కాంగ్రెస్ నేతలు(Congress leaders) ఎవరు హాజరు కాకపోవడంతో కాంగ్రెస్ నాయకులు సదర్ ఉత్సాహాల్లో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రాణి సమయం చూసి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను బీఆర్ఎస్ నేతలు ఆహ్వానించి సదర్ ఉత్సవాలు నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) ముందే మీరు ఎలా ఈ ఉత్సవాలకు ఎలా హాజరవుతారని పలువురు కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు.
ఎమ్మెల్యేతో పాటు హాజరైతే బాగుంటుందని కేవలం ఎమ్మెల్యే లేని సమయం చూసి ఇలా వేడుకలు నిర్వహించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతల సైతం ఎమ్మెల్యే రాకుంటే తాము ఏం చేయాలని పండుగను పండుగలా చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. కొద్ది సమయం ఈ తగాదాలతో సదర్ ఉత్సవం అంతా వేడెక్కింది. కొందరు పెద్దలు మధ్యవర్తిత్వం చేసి ఇరు వర్గాలను శాంతింప చేసి ఉత్సవాలను నిర్వహించారు. ఏమైనా అతిథంగా నిర్వహించుకుంటూ అందర్నీ ఆహ్వానించి నిర్వహించవలసిన ఈ పండుగలు అధికార పార్టీ నేతలు లేకపోవడంతో కాంగ్రెస్ వర్గాలు లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.