ఒకే బైక్‌పై 107 ట్రాఫిక్ చలాన్లు
వనస్థలిపురం ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో వెలుగులోకి
ఎల్బీనగర్, నవంబర్ 18 : వనస్థలిపురం ట్రాఫిక్ పోలీసుల(Vanasthalipuram Traffic Police) తనిఖీల్లో ఒకే బైక్‌పై 107 ట్రాఫిక్ చలాన్లు(Traffic challans) ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. బుధవారం వనస్థలిపురం ట్రాఫిక్ పోలీసులు(Vanasthalipuram Traffic Police) పనామా గోడౌన్ ప్రాంతంలో వాహనాల తనిఖీలు(Vehicle inspections) నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో ఒక ద్విచక్ర వాహనంపై(Two-wheeler) సుమారు 107 ట్రాఫిక్ ఉల్లంఘనలు ఉన్నాయి. చెంచల్‌గూడ ప్రాంతానికి(Chenchalguda area) చెందిన అజర్ పేరుతో ఉన్న హీరో స్ప్లెండర్ బైక్ (AP 28 S 6114)పై ఏకంగా 107 ట్రాఫిక్ చలాన్లు నమోదయ్యాయి. వీటికి సంబంధించి మొత్తం రూ.24,645 జరిమానా పెండింగ్‌లో ఉన్నట్లు వనస్థలిపురం ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో వెల్లడైంది. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, పెండింగ్ చలాన్లను సకాలంలో చెల్లించాలని వనస్థలిపురం ట్రాఫిక్ సీఐ సూచించారు.