భారీ Fire Accident.. 60 షాపులు బూడిద
అగ్నికీలల్లో పుణె Timber Market.. పొగలు కమ్ముకున్న ప్రాంతం
పుణె: మహారాష్ట్రలోని పుణె నగరంలో భారీ అగ్నిప్రమాదం(Pune Market Fire Accident) కలకలం రేపింది. కలప మార్కెట్లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు వేగంగా వ్యాపించడంతో భారీ నష్టం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 50 నుంచి 60 దుకాణాలు అగ్నికి ఆహుతైనట్లు అధికారులు వెల్లడించారు. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనతో మార్కెట్ పరిసర ప్రాంతమంతా దట్టమైన పొగతో కమ్ముకుంది. కలప, ఇతర మండే సామగ్రి పెద్దఎత్తున ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించినట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న Firefighters వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని భారీగా నీటిని చల్లుతూ మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ప్రధాన మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ, దగ్ధమైన దుకాణాల నుంచి పొగలు వెలువడుతూనే ఉండటంతో Cooling Operations కొనసాగించారు. ఈ అగ్నిప్రమాదంలో 50 నుంచి 60 షాపులు దెబ్బతిన్నట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాదానికి గల అసలు కారణాలు, ఆస్తి నష్టం వివరాలపై అధికారులు పరిశీలన చేపట్టారు.