హైదరాబాద్‌లో చైన్ స్నాచింగ్

18-11-2026 | 10:47am

NGRI వద్ద దొంగల బీభత్సం.. క్షణాల్లో చైన్, మొబైల్ మాయం!

హైదరాబాద్: నగరంలో తెల్లవారుజామున Chain Snatchers రెచ్చిపోయారు. NGRI సమీపంలో రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని టార్గెట్ చేసిన ఇద్దరు దుండగులు బంగారు గొలుసుతో పాటు మొబైల్ ఫోన్‌ను అపహరించి బైక్‌పై పరారయ్యారు. బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. మురళీ బాబు (49) అనే వ్యక్తి ఉదయం సుమారు 5.40 గంటల సమయంలో రోడ్డుపై వెళ్తూ మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతున్నారు.

ఇదే అదనుగా భావించిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మోటార్‌సైకిల్‌పై వచ్చి ఆయన మెడలోని 1.5 తులాల బంగారు గొలుసును, చేతిలోని ఫోన్‌ను లాక్కున్నారు. అనంతరం అక్కడి నుంచి తార్నాక వైపు వేగంగా వెళ్లిపోయారు. ఈ ఘటనపై బాధితుడు ఉప్పల్ పోలీసులకు Complaint చేయడంతో కేసు నమోదు చేశారు. నిందితులను గుర్తించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. సమీపంలోని CCTV Footageను పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తెల్లవారుజామున జరిగిన ఈ Chain Snatching ఘటనతో స్థానికంగా ఆందోళన నెలకొంది.

మరిన్ని వార్తలు