సిద్దిపేట అక్రమాలపై విచారణకు డిమాండ్
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రవిచంద్ర డిమాండ్
సిద్ధిపేట క్రైం, నవంబర్ 18: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు(Fee reimbursement dues) విడుదల చేయకపోవడంతో కళాశాలలు మూతపడే పరిస్థితి ఏర్పడిందని, మరోవైపు విద్యా వ్యవస్థలో(Education system) మార్పుల పేరుతో ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలంగాణ రక్షణ సేన(Telangana Rakshana Sena) సిద్ధిపేట జిల్లా అధ్యక్షుడు లోక రవిచంద్ర ఆరోపించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. సిద్ధిపేట జిల్లాలోని(Siddipet District) తొమ్మిది డిగ్రీ కళాశాలల్లో ఎనిమిది కళాశాలలు మూతపడే పరిస్థితికి చేరాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసి విద్యార్థుల(Students) భవిష్యత్తును కాపాడాలని డిమాండ్ చేశారు.
మోహినిపురా వేంకటేశ్వరస్వామి ఆలయ భూముల ఆక్రమణ ఆరోపణలు, రంగనాయకసాగర్ పరిసరాల్లో రైతులను మభ్యపెట్టి 14 ఎకరాల భూమిలో ఫామ్‌హౌస్ నిర్మించారనే ఆరోపణలపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వాసితులకు పెండింగ్ పరిహారం అందించాలని, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో పాటు సిద్దిపేట వ్యాపారులపై బెదిరింపులు, దౌర్జన్యాలు జరిగాయనే ఆరోపణలపైనా సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఎవరైనా చట్టానికి అతీతులు కారని, రాజకీయాలకు అతీతంగా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని లోక రవిచంద్ర ప్రభుత్వాన్ని కోరారు.