మద్యం మత్తులో డ్రైవింగ్.. రూ.3 వేల జరిమానా
347 రీడింగ్‌తో పట్టుబడిన వ్యక్తికి కమ్యూనిటీ సర్వీస్
మంచిర్యాల క్రైమ్, (విజయక్రాంతి): మద్యం మత్తులో(Alcohol intoxication) వాహనం నడుపుతూ ట్రాఫిక్ అనలైజర్ పరీక్షలో(Traffic Analyzer Test) 347 రీడింగ్ నమోదైన కుమ్మరి సురేష్‌ను ట్రాఫిక్ పోలీసులు కోర్టులో(Traffic police court) హాజరుపరిచారు. కేసును విచారించిన మంచిర్యాల సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ రమేష్(Mancherial Second Class Magistrate Ramesh) బుధవారం నిందితుడికి రూ.3 వేల జరిమానా విధించారు. అంతేకాకుండా ఒకరోజు పాటు మంచిర్యాల పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించే ప్లకార్డులు ప్రదర్శిస్తూ కమ్యూనిటీ సర్వీస్ చేయాలని ఆదేశించారు.
ఇదే రోజు మొత్తం 8 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను న్యాయమూర్తి విచారించి నిందితులకు రూ.17 వేల జరిమానా విధించారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఎం.డి. హన్నన్ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల వాహనదారులతో పాటు రోడ్డుపై ప్రయాణించే ఇతరుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. ఒకరి నిర్లక్ష్యం అనేక కుటుంబాల జీవితాలను ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు. వాహనదారులు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనను పర్యవేక్షిస్తూ చిన్నతనం నుంచే క్రమశిక్షణ, బాధ్యతాయుత ప్రవర్తన అలవాటు చేయాలని కోరారు. రోడ్డు భద్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.