IPL అభిమానులకు బిగ్ అప్‌డేట్

18-11-2026 | 12:47pm

రోహిత్, అభిషేక్, సిరాజ్.. రిటైన్ జాబితాలో స్టార్ క్రికెటర్లు!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) అభిమానులకు కీలక అప్‌డేట్ వచ్చింది. డిసెంబర్ 16న జరగనున్న IPL Auctionకు ముందు మొత్తం 10 ఫ్రాంచైజీలు తమ Final Retention Listను ప్రకటించాయి. స్టార్ ఆటగాళ్లను జట్టులోనే కొనసాగిస్తూ ఆయా టీమ్స్ తమ వ్యూహాలను సిద్ధం చేసుకున్నాయి. తాజా Retention జాబితా ప్రకారం మొత్తం 184 మంది క్రికెటర్లకు ఫ్రాంచైజీలు అవకాశం కల్పించాయి. వీరిలో 55 మంది Overseas Players ఉన్నారు. టీమిండియా స్టార్ ఆటగాళ్లు అభిషేక్ శర్మ, రోహిత్ శర్మ, మహమ్మద్ సిరాజ్‌తో పాటు వెస్టిండీస్ స్టార్ సునీల్ నరైన్ కూడా తమ తమ జట్లలో కొనసాగనున్నారు.

ఈసారి Retentionలో గుజరాత్ టైటాన్స్ (GT) అగ్రస్థానంలో నిలిచింది. ఆ జట్టు అత్యధికంగా 22 మంది ఆటగాళ్లను Retain చేసుకుంది. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టులో ఏడుగురు Overseas Players ఉండటంతో విదేశీ ఆటగాళ్ల పరంగా ముందంజలో నిలిచింది. ఐదుసార్లు IPL ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో పాటు పంజాబ్ కింగ్స్ (PBKS), రాజస్థాన్ రాయల్స్ (RR) కూడా 19 మంది చొప్పున ఆటగాళ్లను జట్టులో కొనసాగించాయి. దీంతో డిసెంబర్ 16న జరిగే Auctionపై క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. మిగిలిన ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తాయో చూడాలి.

మరిన్ని వార్తలు