మధ్యాహ్నం ఈ రోడ్లు బంద్
ఢిల్లీలో రెండు గంటల ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ రోడ్లపై జాగ్రత్త!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రయాణించేవారికి Traffic Alert! బుధవారం మధ్యాహ్నం రెండు గంటల పాటు ఉత్తర ఢిల్లీలోని పలు ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఆంక్షలు(Delhi Traffic Restrictions) అమలు చేయనున్నారు. ప్రత్యేక ఏర్పాట్ల నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వాహనాల రాకపోకలకు అంతరాయం కలగనుంది. ఈ మేరకు ట్రాఫిక్ పోలీసులు ముందస్తు Advisory జారీ చేశారు. ఉత్తర ఢిల్లీలోని వజీరాబాద్ ఫ్లైఓవర్ నుంచి సలీమ్‌గఢ్ వై-జంక్షన్ వరకు ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు పలు కీలక మార్గాల్లో వాహనాల రాకపోకలపై ప్రభావం పడనుంది. షామ్‌నాథ్ మార్గ్, మాల్ రోడ్, సుధీర్ బోస్ మార్గ్, ఛత్ర మార్గ్, యూనివర్సిటీ రోడ్, జీటీబీ మార్గ్, బులేవార్డ్ రోడ్, రాణి ఝాన్సీ రోడ్, డాక్టర్ కర్న్వాల్ మార్గ్, మహాత్మా గాంధీ మార్గ్‌లలో ట్రాఫిక్ రద్దీ పెరిగే అవకాశం ఉంది.
అవసరాన్ని బట్టి ట్రాఫిక్ డైవర్షన్స్..
వాహనాల రద్దీని నియంత్రించేందుకు పలు ప్రాంతాల్లో Traffic Diversions అమలు చేయనున్నారు. వజీరాబాద్ ఫ్లైఓవర్, చాంద్‌గిరామ్ అఖాడా, యుధిష్టర్ సేతు వై-జంక్షన్, యుధిష్టర్ సేతు కింద, షామ్‌నాథ్ మార్గ్ రెడ్‌లైట్, సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ రెడ్‌లైట్, రూప్ నగర్ పోలీస్ స్టేషన్ రౌండబౌట్, మారిస్ నగర్ రెడ్‌లైట్ ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి వాహనాలను ఇతర మార్గాల్లోకి మళ్లించనున్నారు. ప్రత్యేక ఏర్పాట్ల కారణంగా వాహనదారులు తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర ఢిల్లీ మీదుగా వెళ్లేవారు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడం మంచిది. చివరి నిమిషంలో ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు.