కేటీఆర్‌కు ఉత్తమ్ స్ట్రాంగ్ కౌంటర్

18-11-2026 | 07:03pm

హైదరాబాద్: తెలంగాణలో కృష్ణా జలాల(Krishna River Water) అంశం రాజకీయంగా మరోసారి వేడెక్కింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) చేసిన విమర్శలకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) గట్టిగా బదులిచ్చారు. కృష్ణా బేసిన్(Krishna Basin) పరిధిలో పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తిచేయలేకపోయారని ఆయన విమర్శించారు.

కృష్ణా నది(Krishna River) పరిధిలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఉత్తమ్ ఆరోపించారు. నాగార్జున సాగర్ కింద సుమారు 21 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నప్పటికీ, బీఆర్ఎస్ పాలనలో ఒక్క ఎకరాకు కూడా కృష్ణా జలాలు అందించలేదని వ్యాఖ్యానించారు. జల్ జీవన్ మిషన్(Jal Jeevan Mission) కింద ఆంధ్రప్రదేశ్ 1.8 టీఎంసీల నీటి సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మిస్తోందని మంత్రి వెల్లడించారు. రాష్ట్రానికి సంబంధించిన సాగునీటి, తాగునీటి ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని పేర్కొన్నారు.

ఇటీవల కృష్ణా జలాల వినియోగం, నాగార్జున సాగర్ నుంచి ఏపీ చేపడుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నీటి తరలింపు అంశాలపై కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కృష్ణా జలాల హక్కులు, ప్రాజెక్టుల నిర్మాణం, గత ప్రభుత్వాల పనితీరుపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

మరిన్ని వార్తలు