సీఎం రేవంత్‌కు డిఫరెంట్ వెల్కమ్

18-11-2026 | 10:31am

రేవంత్ పర్యటన వేళ సిద్దిపేటలో హాట్ టాపిక్.. ఎక్కడ చూసినా పెండింగ్ వర్క్స్ ఫ్లెక్సీలే!

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలు(Telangana Politics) మరోసారి రసవత్తరంగా మారాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన నేపథ్యంలో పట్టణంలో ఏర్పాటు చేసిన వినూత్న ఫ్లెక్సీలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. గత ప్రభుత్వ హయాంలో మంజూరైనప్పటికీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో నిలిచిపోయిన Development Works‌ను తిరిగి ప్రారంభించాలని కోరుతూ ప్రజలు ఈ Flexi Campaign చేపట్టారు. సిద్దిపేటలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల పరిస్థితిని సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. శిల్పారామం, వెయ్యి పడకల ఆసుపత్రి, నర్సింగ్ కాలేజీ, సిద్దిపేట–ఇల్లంతకుంట రోడ్డు, వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్ వంటి కీలక ప్రాజెక్టుల వద్ద ఈ ఫ్లెక్సీలను ప్రదర్శించారు. గతంలో మంజూరైన పనులను రద్దు చేయకుండా తిరిగి కొనసాగించి, త్వరగా పూర్తి చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు.

మరోవైపు పిల్లర్ల నిర్మాణంతోనే ఆగిపోయిన వెటర్నరీ కాలేజీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 'సీఎం గారూ.. నన్ను ఎప్పుడు ప్రారంభిస్తారు?' అంటూ కాలేజీ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అటు కళాశాలను తిరిగి అందుబాటులోకి తీసుకురావాలని విద్యార్థులు సైతం తమ ఆవేదనను వ్యక్తం చేశారు. సీఎం పర్యటనకు ముందే సిద్దిపేటలో ఈ Flexi Protest ఆసక్తికర చర్చకు దారితీసింది. ఆగిపోయిన Development Projects‌కు మళ్లీ మోక్షం లభిస్తుందా? సీఎం రేవంత్ రెడ్డి ఈ విజ్ఞప్తులపై ఎలాంటి స్పందన ఇస్తారన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఈ ఫ్లెక్సీలకు సంబంధించిన పోస్టును మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తన X (Twitter) ఖాతాలో షేర్ చేశారు.


మరిన్ని వార్తలు