ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

23-11-2026 | 03:36pm

జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి తిరుపతి రెడ్డి

నల్లబెల్లి, నవంబర్ 23( విజయ క్రాంతి ): రైతులు(Farmers) పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని, దళారులను నమ్మి మోసపోవద్దని జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి చిట్యాల తిరుపతి రెడ్డి సూచించారు. సోమవారం నల్లబెల్లి మండల కేంద్రంలో(Nallabelli Mandal Center) వీఎఫ్‌జీ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అధికారులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా పలువురు నాయకులు, అధికారులు మాట్లాడుతూ.

రైతులు ధాన్యాన్ని ఆరబెట్టి, తేమ శాతం నిబంధనల ప్రకారం కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో ఏడీఏ, తహసీల్దార్ ముప్పు కృష్ణ, ఏఓ రజిత, వీఎఫ్‌జీ సొసైటీ చైర్మన్ శ్రీనివాస్, మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సర్పంచులు పోషాలు, హేమలత శ్రీధర్, గ్రామ కమిటీ అధ్యక్షులు వెంగళదాస్ రమేష్, వైనాల వీరస్వామి, నాయకులు జెట్టి రామ్మూర్తి, పూల్ సింగ్, చిట్యాల ఉపేందర్ రెడ్డి, పోగుల కుమారస్వామి, బత్తిని మహేష్, సామల దేవేందర్, వార్డు సభ్యులు సామల రాజు, పోడేటి కిషోర్, బత్తిని హరీష్, సురేష్, ఆడెపు రమేష్, సుదర్శన్, భిక్షపతి, స్థానిక రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు