స్మార్ట్ రేషన్ కార్డ్స్ పంపిణీ చేసిన చైర్ పర్సన్, తహసీల్దార్
లక్షేట్టిపేట, నవంబర్ 23(విజయక్రాంతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డ్స్(smart ration cards) పంపిణీ ప్రక్రియను సోమవారం మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేటలోని ఇటిక్యాలలో మున్సిపల్ చైర్ పర్సన్ దొంత అంజలి నర్సయ్య, తహసీల్దార్ దిలీప్ కుమార్ ల ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉంటుందన్నారు. సమాజంలోని ఏ ఒక్కరూ ఆకలితో బాధపడవద్దని అందరికీ సన్న బియ్యం అందిస్తున్నట్లు వివరించారు.
అదే విధంగా ఉచిత బస్సు ప్రయాణం, కరెంట్, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పెన్షన్స్ అందిస్తూ అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తోందని తెలిపారు. అనంతరం పలు వార్డులకు సంబంధించిన రేషన్ కార్డ్స్ ను లబ్ధిదారులకు అందజేశారు. ఒకటవ వార్డ్ కౌన్సిలర్ బుద్దె సిద్ధార్థ ( బిట్టు ) ఆ వార్డ్ లబ్ధి దారులకు స్మార్ట్ రేషన్ కార్డ్స్ అందజేశారు.రెండవ వార్డ్ లో కౌన్సిలర్ పెట్టెం తిరుపతి స్మార్ట్ రేషన్ కార్డ్స్ లబ్ధి దారులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ మోత్కూరి రాజేశ్వరి వెంకటస్వామి గౌడ్,నాయకులు గోళ్ళ కాంతయ్య, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.