ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ప్రారంభం
సదాశివనగర్, నవంబర్ 23 (విజయక్రాంతి): ప్రభుత్వం (Government) ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా (Life Insurance) పథకాన్ని సోమవారం లింగంపల్లి గ్రామంలో ప్రారంభించారు. ఈ నెల 23 నుంచి 28వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ (Applications), ఆన్‌లైన్ ప్రక్రియ (Online Process) గ్రామపంచాయతీ కార్యాలయంలో కొనసాగుతుందని సర్పంచ్ టేక్రియాల లావణ్య రమేష్ తెలిపారు.
ప్రతి కుటుంబంలో ఒకరికి జీవిత బీమా కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని ఆమె వెల్లడించారు. గ్రామంలోని ప్రతి కుటుంబం తప్పనిసరిగా బీమా చేయించుకుని భరోసాగా ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గంగారాం, వార్డు సభ్యులు రమేష్ రావు, శ్రీకాంత్, జ్యోతి, గంగయ్య, సౌమ్య, పద్మ, పంచాయతీ కార్యదర్శి ప్రకాష్, సీఏ రవి, గ్రామస్తులు పాల్గొన్నారు.