కొల్లాపూర్‌లో ఐదెకరాల క్రీడా మైదానం ఏర్పాటు చేయాలి
ఆర్డీవో బన్సీలాల్‌కు క్రీడాకారుల వినతి.. భూమి పరిశీలిస్తామని హామీ.
కొల్లాపూర్ నవంబర్ 23: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలో(Kolhapur Constituency Center) ఐదెకరాల స్థలంలో మెరుగైన వసతులతో క్రీడా మైదానం(Sports field) ఏర్పాటు చేయాలని కోరుతూ క్రీడాకారులు సోమవారం ఆర్డీవో బన్సీలాల్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
స్పందించిన ఆర్డీవో మైదానం ఏర్పాటుకు అనువైన భూమిని పరిశీలిస్తామని సానుకూలంగా తెలిపారు. ప్రస్తుతం ఉన్న జఫర్ మైదానం చిన్నదిగా ఉండటంతో క్రీడాకారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, యువత క్రీడల్లో రాణించేందుకు సరైన వసతులు కల్పించాలని కోరారు. మంత్రి జూపల్లి కృష్ణారావు చొరవ తీసుకొని కొల్లాపూర్‌లో ఐదారు ఎకరాల క్రీడా మైదానం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ క్రీడాకారులు శేఖర్ గౌడ్, రాజు గౌడ్, చందు, వెంకటేష్, దుబాయ్ స్వామి, రాజు, సైదులు, షాలు, మల్లేష్, ధర్మేష్ తదితరులు పాల్గొన్నారు.