సింగరేణి ఉచిత వృత్తి విద్యా శిక్షణ

23-11-2026 | 03:01pm

భూపాలపల్లి టౌన్, నవంబర్ 23 (విజయక్రాంతి): సింగరేణి సేవా సమితి (Singareni Seva Samithi) ఆధ్వర్యంలో పలు వృత్తి విద్యా కోర్సుల్లో ఉచిత శిక్షణ (Free Training) అందించనున్నట్లు భూపాలపల్లి ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్. శ్యామ్ సుందర్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

టైలరింగ్, కంప్యూటర్ డీటీపీ, మగ్గం వర్క్స్, మల్టీమీడియా, క్లాత్, జూట్, బంజారా బ్యాగుల తయారీ వంటి కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు ఫారాలను సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయంలోని భూపాలపల్లి ఏరియా పర్సనల్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న సేవా సమితి కార్యాలయం నుంచి పొందవచ్చని సూచించారు.

దరఖాస్తుతో పాటు పదో తరగతి మెమో, కుల ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, సింగరేణి ఉద్యోగి గుర్తింపు కార్డు జిరాక్స్ కాపీలు రెండేసి చొప్పున, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు జతచేయాలని పేర్కొన్నారు. ప్రతి బ్యాచ్‌లో 20 మందికి మాత్రమే శిక్షణ (Vocational Courses) అందించనున్నారు. దరఖాస్తులు ఎక్కువగా వచ్చినట్లయితే అర్హులైన 20 మందిని ఎంపిక చేస్తామని తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 28వ తేదీ శనివారం సాయంత్రం 5 గంటల్లోగా సమర్పించాలని ఏరియా పర్సనల్ మేనేజర్ కోరారు.

మరిన్ని వార్తలు