రైస్ మిల్లర్ల అక్రమాలపై ఈడీ దూకుడు

23-11-2026 | 12:32pm

తెలంగాణ రైస్ మిల్లర్లకు ఈడీ బిగ్ షాక్

రూ.6,700 కోట్ల ధాన్యం మాయం

అక్రమాలపై కొరడా ఝళిపించేందుకు సిద్ధం

ప్రభుత్వ ధాన్యం పక్కదారి పట్టించారా? వేల కోట్ల రూపాయల విలువైన ధాన్యం ఏమైంది? తెలంగాణలో రైస్ మిల్లర్ల అక్రమాల వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారుతోంది.

తెలంగాణలో రైస్ మిల్లర్ల అక్రమాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచుతోంది. ప్రభుత్వానికి చెందిన ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మిల్లర్లపై మరిన్ని కేసులు నమోదు చేసే దిశగా విచారణ కొనసాగిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అక్రమాలకు పాల్పడినట్లు అనుమానిస్తున్న రైస్ మిల్లులపై ప్రత్యేకంగా నజర్ పెట్టింది.

2021-22 నుంచి ఇప్పటివరకు జరిగిన ధాన్యం మళ్లింపుపై ఈడీ ఆరా తీస్తోంది. ఈ వ్యవహారంలో సుమారు రూ.6,700 కోట్ల విలువైన ప్రభుత్వ ధాన్యం పక్కదారి పట్టినట్లు అంచనా వేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.వేల కోట్ల ధాన్యం మళ్లింపు వెనుక ఎవరున్నారు? ఏయే మిల్లులు అక్రమాలకు పాల్పడ్డాయి? ప్రభుత్వ ధాన్యం పక్కదారి పట్టించిన వ్యవహారంలో ఇంకా ఎన్ని సంచలన విషయాలు బయటకు వస్తాయి? అనే ఉత్కంఠ నెలకొంది. ఈడీ విచారణతో అక్రమార్కుల గుండెల్లో గుబులు మొదలైంది!

మరిన్ని వార్తలు