కామారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఆకుల కల్పన

23-11-2026 | 03:22pm

నియామక పత్రాన్ని అందజేసిన రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు స్వర్ణ 

కామారెడ్డి, నవంబర్ 23 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్(Women Congress) అధ్యక్షురాలుగా ఆకుల కల్పన నియమిస్తూ సోమవారం రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ నియామక పత్రాన్ని అందజేశారు. కాంగ్రెస్ పార్టీ శ్రేయస్సు కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ సందర్భంగా ఆకుల కల్పన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు జిల్లాలో మహిళ కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని అన్నారు. కామారెడ్డి జిల్లాలో మహిళా కాంగ్రెస్ పటిష్ట వంతానికి సభ్యత్వ  నమోదు తో పార్టీ కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకెళ్తానన్నారు.

మహిళా కాంగ్రెస్ అధ్యక్షుడుగా నియామకానికి విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్, జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు, కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, ఎల్లారెడ్డి నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ నాయకురాలు అరుణ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ ఆకుల శ్రీనివాస్, చంద్రశేఖర్, రమణ, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు