ఎస్ఐఆర్‌పై ఇండియా కూటమికి కౌంటర్
కరీంనగర్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటనతో రాజకీయ సందడి నెలకొంది. ఎస్ఐఆర్ (SIR) అంశంపై ఇండియా కూటమి చేస్తున్న విమర్శలకు ఆయన స్పందించారు. కరీంనగర్‌లో పర్యటిస్తున్న నితిన్ నబీన్ మరికాసేపట్లో మహాపాదయాత్రలో (Maha Padyatra) పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్ఐఆర్‌పై ఇండియా కూటమి అనవసర రాద్ధాంతం చేస్తోందని విమర్శించారు. ఈ అంశంపై బీజేపీ తరఫున ఇచ్చిన వివరణకు ప్రజల నుంచి మద్దతు లభిస్తోందని తెలిపారు.తమకు మద్దతు తెలిపేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చిన కరీంనగర్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. నితిన్ నబీన్ మహాపాదయాత్రలో పాల్గొననుండటంతో స్థానికంగా రాజకీయ చర్చకు ప్రాధాన్యం ఏర్పడింది.