దాతల దాతృత్వం గొప్పది: సర్పంచ్ దున్నా శ్రీనివాస్

06-11-2026 | 08:05pm

కోదాడ (నడిగూడెం) నవంబర్ 06 (విజయక్రాంతి): దాతల దాతృత్వం చాలా గొప్పదని అభినందనీయమని నడిగూడెం గ్రామ సర్పంచ్ దున్నా శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం నడిగూడెం మండల కేంద్రంలోని రైతు వేదికకు వచ్చే రైతుల కు మంచినీటి సౌకర్యం కొరకు ఎక్లాస్ ఖాన్ పేట గ్రామానికి చెందిన కీర్తిశేషులు రౌతు రవీంద్రబాబు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు రౌతు కొండలరావు అందించిన పదివేల రూపాయల విలువగల వాటర్ ఫిల్టర్(Water Filter)ను మండల వ్యవసాయ అధికారి మల్సూర్ తో కలసి శుక్రవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ దాతల ముందుకు వచ్చి దాతృత్వం చాటుకోవడం వలన గ్రామాల్లో అభివృద్ధికి దోహదపడుతుందని గ్రామ అభివృద్ధికి దాతల సహకారం ఎంతో ముఖ్యమని దాతలు ముందుకు వచ్చి గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు. రైతులకు ఫిల్టర్ వాటర్ ను అందించేందుకు ముందుకు వచ్చిన దాతలను ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు వెంకటరెడ్డి, మౌనిక, రైతులు పందిరి వెంకటరెడ్డి, గుండు శ్రీనివాస్, పల్లపు శ్రీనివాస్, దున్న లింగయ్య, దున్న శ్రీకాంత్, బాణాల సతీష్ కుమార్, కాసాని గోపీనాథ్, దాసరి శ్రీనివాస్, కత్తి విజయ్, శ్రీరాముల శ్రీనివాస్, ఎలకా సంజీవరెడ్డి, తదితరులు  పాల్గొన్నారు..

మరిన్ని వార్తలు