కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దుప్ల మృతి

24-10-2026 | 09:52pm

కోదాడ,(విజయక్రాంతి): కోదాడ మండలం కూచిపూడి తండాలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దుప్ల గుండెపోటుతో శనివారం మరణించారు. పలువురు నాయకులు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి పార్థీవ దేహంపై పుష్ప మాలలు ఉంచి సంతాపాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో  కోదాడ మండల పార్టీ అధ్యక్షులు శబ్బశ్వరావు, ఉపాధ్యక్షులు ఇర్ల సీతారామ్ రెడ్డి, పిఎసిఎస్ ఎర్రవరం వైస్ చైర్మన్ కొప్పుల సుభాష్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి బాబు, సర్వతంమ్ రెడ్డి, గ్రామ సర్పంచ్ హాజీ ,తదితరులు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసినారు.

మరిన్ని వార్తలు