మాజీ పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ కుటుంబానికి రసమయి పరామర్శ

24-10-2026 | 10:37pm

బెజ్జంకి, అక్టోబర్‌ 24: బెజ్జంకి మండలం(Bejjanki Mandal) రాంసాగర్‌ గ్రామానికి చెందిన పీఏసీఎస్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంగాల నాగమల్లేశం మృతి చెందడంతో మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ రసమయి బాలకిషన్‌(Dr. Rasamayi Balakishan) శనివారం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. నాగమల్లేశం సతీమణి, గ్రామ సర్పంచ్‌ ఇంగాల లక్ష్మితో పాటు కుటుంబ సభ్యులను కలిసి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్టకాలంలో కుటుంబ సభ్యులకు ఆ దేవుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్‌రెడ్డి, లింగాల లక్ష్మణ్‌, కచ్చు రాజయ్య,  ఎల శేఖర్‌బాబు,  ఘనపురం తిరుపతి, మాశం బాబు, కనగండ్ల శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు