బిల్లు డబ్బుల కోసం గన్‌తో బెదిరింపు
హైదరాబాద్: నగరంలోని సోమాజిగూడలో ఉన్న హెడ్‌క్వార్టర్స్ బార్ అండ్ రెస్టారెంట్(Headquarters Bar and Restaurant)లో తుపాకీ బెదిరింపులు కలకలం రేపాయి. బిల్లు డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ ఓ యువకుడు రెస్టారెంట్ సిబ్బందిని రివాల్వర్(Revolver)తో బెదిరించినట్లు సమాచారం. ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెస్టారెంట్‌లో బిల్లు డబ్బుల(Restaurant bill dispute) విషయంలో యువకుడికి సిబ్బంది, బౌన్సర్లతో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో తన కారులో నుంచి రివాల్వర్ తీసిన యువకుడు, డబ్బులు తిరిగి ఇవ్వకపోతే కాల్చేస్తానంటూ బెదిరించాడు. యువకుడు తుపాకీ చూపించడంతో రెస్టారెంట్‌లోని సిబ్బంది, కస్టమర్లు భయాందోళనకు గురయ్యారు. ఈ క్రమంలోనే బౌన్సర్లు వెంటనే అప్రమత్తమై నిందుతుడిని అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.
బార్ యాజమాన్యం సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నింధితుడిని అదుపులోకి తీసుకుని రివాల్వర్‌తో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మహమ్మద్ షానవాజ్‌ను నిందితుడిగా పోలీసులు గుర్తించారు. రెస్టారెంట్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. బిల్లు చెల్లింపుల వివాదం తుపాకీ బెదిరింపుల వరకు వెళ్లడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఘటనపై తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు పేర్కొన్నారు.