ఆర్డీఎస్‌ నీటి కొరతతో వరి పంటకు నిప్పు!

24-10-2026 | 10:39pm

మాన్‌దొడ్డిలో 20 ఎకరాల పంట దగ్ధం

అలంపూర్, అక్టోబర్ 24 : ఆర్డీఎస్‌ నుంచి సాగునీరు(Irrigation water) అందక జోగులాంబ గద్వాల జిల్లా(Jogulamba Gadwal District) రాజోలి మండలం మాన్‌దొడ్డి గ్రామంలో కౌలు రైతులు(Tenant farmers) మోహన్‌ సాగర్‌, వెంకటేష్‌ సాగర్‌ సుమారు 20 ఎకరాల వరి పంటకు శనివారం నిప్పు పెట్టారు. సాగు కోసం భారీగా పెట్టుబడులు పెట్టినప్పటికీ, కీలక దశలో నీరు అందక పంట ఎండిపోవడంతో తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.అధికారుల నిర్లక్ష్యమే తమ దుస్థితికి కారణమని ఆరోపిస్తూ, పంట నష్టాన్ని క్షేత్రస్థాయిలో అంచనా వేసి తగిన పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.

మరిన్ని వార్తలు