కొండగట్టు అంజన్నను దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి

24-10-2026 | 10:26pm

కొడిమ్యాల, అక్టోబర్ 24 (విజయక్రాంతి): చొప్పదండి నియోజకవర్గం(Choppadandi Constituency) లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామిని(Kondagattu Anjaneya Swamy) తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి నరసింగరావు(Justice Narasinga Rao of the Telangana State High Court) కుటుంబ సమేతంగా విచ్చేసి  దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అధికారులు న్యాయమూర్తి  స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి,తీర్థప్రసాదాలు అందజేశారు.అర్చకులు, వేద పండితులు వేదాశీర్వచనం అందించారు.

మరిన్ని వార్తలు