KRMB భేటీకి బ్రేక్‌.. ఎందుకంటే!

24-10-2026 | 05:26pm

హైదరాబాద్‌: ఈనెల 26న జరగాల్సిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) సమావేశం వాయిదా పడింది. సమావేశాన్ని వాయిదా వేయాలని ఆంధ్రప్రదేశ్‌ సాగునీటి శాఖ అధికారులు కేఆర్‌ఎంబీకి లేఖ రాశారు.

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సమావేశాన్ని వాయిదా వేయాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఏపీ సాగునీటి శాఖ అధికారుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న కేఆర్‌ఎంబీ (Board Meeting) సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఈనెల 26న జరగాల్సిన సమావేశం వాయిదా పడింది. సమావేశం తదుపరి తేదీకి సంబంధించి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

మరిన్ని వార్తలు