భూభారతి – భూసర్వే అవగాహన సదస్సు
ఘట్ కేసర్, అక్టోబర్ 24 (విజయక్రాంతి) : పోచారం డివిజన్(Pocharam Division) పరిధి యంనంపేట్ లో ఘట్కేసర్ తహసీల్దార్ చంద్రశేఖర్(Ghatkesar Tahsildar Chandrashekhar) ఆధ్వర్యంలో శనివారం భూభారతి(BhuBharati) – భూసర్వే అవగాహన సదస్సు(Land Survey Awareness Seminar) కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా గ్రామంలోని భూముల సమగ్ర సర్వే, డిజిటల్ మ్యాపింగ్(Digital Mapping), భూదార్ కార్డు కు సంబంధించిన అంశాలపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్, ఆర్ఐ సాయిరాం, సర్వేయర్ రూప, నాయకులు పోచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మెట్టు గణేష్ యాదవ్,
మాజీ సర్పంచ్ పత్తెపు రాములు, గ్రామ శాఖ అధ్యక్షులు సహదేవ గౌడ్, సగ్గు శ్రీనివాస్, పోలగోని ప్రభాకర్ గౌడ్, రేగు సత్యనారాయణ, పత్తెపు పోశెట్టి, పోలగోని కృష్ణ గౌడ్, నలరాళ్ల కొండల్ రెడ్డి, సగ్గు జగన్మోహన్, పత్తెపు పాండు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.