ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యవేదిక సమావేశం

24-10-2026 | 10:45pm

పాల్వంచ, ( విజయక్రాంతి): ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక(SC, ST, BC, and Minority United Forum) సమావేశం శనివారం కొమరం భీమ్ కార్యాలయంలో(Komaram Bheem Office) నిర్వహించారు.  ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా(Khammam District) అడ్వకేట్ మేకల సుగుణ దళిత  కొత్తగూడెం అడ్వకేట్  నర్సింగ్ నరసింహ చారి ,బానోతు లీలావతి ఎక్స్ ఎంపీపీ ఎక్స్ కొత్తగూడెం అశోక్  మైనార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండి రఫీ జూనియర్ గద్దర్ భాష అల్లూరి సాంబశివరావు కొత్తపల్లి శ్రీనివాసరావు , అశోక్ దళిత సమితి జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక రౌండ్ టేబుల్ సమావేశాన్ని వాన పగుల రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. పాల్వంచ మండలంలో పట్టణంలో అట్టడుగు వర్గాల కమ్యూనిటీలకు భూములు ,సంక్షేమ పథకాలు  ఎలాంటి ప్రయోజనాలు లేకుండా వివక్షతలు దాడులు హత్యలు మానభంగాలు చేస్తున్నటువంటి వర్గాలపై తీవ్రంగా వ్యతిరేకించారు. త్వరలో భవిష్యత్తు కార్యక్రమం నిర్వహించి ఈ ఒక్క వేదిక తరపున బహుజనులను ఒక తాటిపైకి తెచ్చి వారి హక్కులను వారికి వచ్చేలాగా పోరాటాలు నిర్వహించడానికి నిర్ణయించడమైనది.

మరిన్ని వార్తలు