జల సిరి పనుల పరిశీలన
కొడిమ్యాల అక్టోబర్ 24 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా(Jagtial District) కొడిమ్యాల మండలం డబ్బు తిమ్మాయపల్లి,శనివారం పేట, తిరుమలాపూర్ గ్రామాలలో జల సిరి పనులలో('Jala Siri' works) భాగంగా ఇంకుడు గుంతలు, కమ్యూనిటీ ఇంకుడు గుంతలు(Percolation pits), ఫారం ఫండ్, కమ్యూనిటీ ఫారం ఫండ్ పనులను పర్యవేక్షించడం జరిగింది.కూలీలతో మాట్లాడడం జరిగింది, ఈ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొనవలసి ఉంది కానీ, అత్యవసర మీటింగ్ వల్ల హాజరు కాలేకపోయారు.
ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ రఘువరన్(DRDO Raghuvaran), ఆర్డబ్ల్యూఎస్ ఈఈ మురళి, కొడిమ్యాల ఎంపీడీవో స్వరూప, ఎంపీఓ భగవాన్, ఏపీవో సతీష్,డిస్టిక్ టెక్నికల్ పర్సన్ డిటిసి మనోజ్, ఆర్డబ్ల్యూఎస్ కల్పన, వివిధ గ్రామాల సర్పంచులు సురకంటి లావణ్య-ముత్యంరెడ్డి,గోలి ఐలయ్య,అంజయ్య, ఉప సర్పంచులు, టెక్నిఅసిస్టెంట్లు, శ్రీనివాస్ భువన్ గౌతమి, పంచాయతీ కార్యదర్శులు, పావని,రాజేష్,మహేష్, తదితరులు పాల్గొన్నారు, జలసిరి భాగంగా ఫారం పండ్లు, ఇంటింటికి ఇంకుడు గుంతలు, బోర్ వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్, పనులను నీటి సంరక్షణ పనులను ఎక్కువగా చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది.