మైనింగ్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి!

24-10-2026 | 04:03pm

అల్లూరి జిల్లాలో ఘోర పేలుడు (Explosion) సంభవించి ఏడుగురు మృతి చెందారు. అనంతగిరి మండలం పినకోట సమీపంలోని మైనింగ్ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనాస్థలంలోనే ఐదుగురు మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.

బొలెరో వాహనం నుంచి డీజిల్‌ను టిప్పర్‌లో నింపుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. బొలెరో వాహనంలో ఉన్న జిలెటిన్ స్టిక్స్‌కు మంటలు అంటుకోవడంతో భారీ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. పేలుడు కారణాలు, మృతుల వివరాలు, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టే అవకాశం ఉంది (Investigation).

మరిన్ని వార్తలు